Home Page SliderNationalNews

దుమ్మురేపుతున్న పుష్ప 2 ద రూల్ ట్రైలర్

Share with

అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే.. పులి వచ్చిందని అర్థం.. పులే రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చిండని అర్థం అంటూ.. అల్లు అర్జున్ ను గ్రాండ్ గా దర్శకుడు సుకుమార్, పుష్ప 2 మూవీ కోసం ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశారు. పుష్ప బతికే ఉన్నాడంటూ చెప్పడం.. పుష్పగాడి రూల్ అంటూ చెప్పడాన్ని ట్రైలర్ లో చూపించారు సుకుమార్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ద రూల్ టీజర్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. వేరీజ్ పుష్ప అంటూ ట్రైలర్ అల్లు అర్జున్ అభిమానులపై విరుచుకుపడుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 1 దుమ్మురేపడంతో.. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అన్న చర్చ గత కొద్ది రోజులుగా సాగుతోంది. పుష్ప 1, దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ బాక్సుఫీసు రికార్డులను బద్ధలు కొట్టింది. దేశ వ్యాప్తంగా పుష్ప ఫీవర్ ఏడాదిగా కొనసాగుతోంది. తాజాగా పుష్ప 2 ద రూల్ టీజర్ అదే స్థాయిలో వచ్చేసింది. పుష్ప తప్పించుకోవడం దగ్గర మొదలైన టీజర్, పుష్ప కోసం జరిగిన కూంబింగ్ ఆపరేషన్లు జరిగాయంటూ వివరిస్తుంది. అయితే పుష్ప పోలీసులు కాల్పుల్లో చనిపోయారంటూ కూడా చూపించారు. 8 బుల్లెట్లు దిగాక ఇక పుష్ప ఇక బతికి ఉండరన్న చర్చను టీవీ చానెళ్లలో సాగుతున్నట్టుగా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు. అయితే పుష్ప గురించి ప్రజలు ఆవేదన చెందడాన్ని కూడా చూపించారు.

పుష్ప గొప్పతనాన్ని దర్శకుడు సుకుమార్ ఓ స్థాయిలో ఎలివేట్ చేశారు. పుష్పపై కాల్పుల తర్వాత నెల రోజుల పాటు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. అయితే పుష్ప విదేశాలకు వెళ్లిపోయాడా.. లేదంటే అడవుల్లోనే ఉన్నాడా అన్న వర్షన్‌ను మూవీలో చూపించారు. అయితే పుష్ప శేషాచలం అడవుల్లోనే ఉన్నారన్నట్టుగా సిటీ కేబుల్ చానెల్లో చూపించడాన్ని దర్శకుడు ఎంచుకున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలాయలం, కన్నడం భాషల్లో ట్రైలర్లను విడుదల చేయించి.. దేశ వ్యాప్తంగా అభిమానులకు.. పుష్ప 2 ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ కలిగించాడు దర్శకుడు సుకుమార్.