News

దుమ్మురేపుతున్న పుష్ప-2 సాంగ్, యూట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్

Share with

ఇప్పుడు దేశ వ్యాప్తంగా పుష్ప 2 మేనియా పోటెత్తుతోంది. రెండేళ్ల క్రితం రిలైజ్ అయిన పుష్ప 1 ప్రపంచ వ్యాప్తంగా సినిమా రికార్డులు బద్ధలు కొట్టడగా ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ చేసేందుకు దర్శకుడు సుకుమార్ రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఇప్పటికే మూవీలోనే రెండు పాటలు రిలీజ్ చేయగా యూట్యూబ్ షేక్ అవుతోంది. రెండు వారాల క్రితం రిలీజ్ చేసిన సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి పాట, ఆరు భాషల్లోనూ ఉర్రూతలూగిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాట పది కోట్ల వ్యూస్ రీచ్ అయ్యింది. యూట్యూబ్ మ్యూజిక్‌లో నేటికీ ఈ పాట ట్రెండింగ్ నెంబర్ 1 కొనసాగుతోంది. ఈ పాటకు అన్ని భాషల్లో ఇప్పటి వరకు 16 లక్షల 70 వేల లైక్స్ రావడం విశేషం. ఇక 6 భాషల్లో విడుదలై ఈ సాంగ్ తెలుగు, హిందీలో దుమ్మురేపుతోంది. తెలుగులో ఇప్పటి వరకు 5 కోట్ల 81 లక్షల వ్యూస్ రాగా, హిందీలో 3 కోట్ల 76 లక్షల వ్యూస్ రాబట్టింది. ఇక తమిళలో 43 లక్షలు, కన్నడలో ఎనిమిదిన్నర లక్షలు, మళయాళంలో 5.8 లక్షలు, బెంగాళీలో 9.4 లక్షల వ్యూస్ రాబట్టింది. ఈ పాటను 6 భాషల్లో శ్రేయ ఘోషాల్ ఒక్కరే పాడటం విశేషం. ఆమె అన్ని భాషలకు పూర్తి న్యాయం చేశారని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఏ భాషకు ఆ భాషకు న్యాయం చేయడం ఒక్క శ్రేయో ఘోషాల్ కు మాత్రమే సాధ్యమంటూ కీర్తిస్తున్నారు. 6 భాషలకు ఆమె న్యాయం చేశారంటూ అభినందిస్తున్నారు.