NationalNews Alert

చరిత్రలోనే ఫస్ట్ టైమ్ పాదయాత్రతో ప్రమోషన్

Share with

హీరో , హీరోయిన్లు తమ సినిమా ప్రమోషన్స్ కోసం పలు చోట్లకు వెళ్తుండటం సహజమైన విషయమే. కానీ హీరో నాగశౌర్య నటించిన “కృష్ణ వ్రింద విహారి” సినిమా ఈనెల 23న రీలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ వినూత్నంగా తెలుగు సినీ పరిశ్రమలోనే మెట్టి మొదటిసారిగా పాదయాత్ర ద్వారా ప్రమోషన్స్ చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ పాదయాత్ర ప్రమోషన్‌లో హీరో నాగశౌర్యతో పాటు చిత్రబృందం తిరుపతి , నెల్లూరు , ఒంగోలు , విజయవాడ , గుంటూరు , ఏలూరు , భీమవరం , రాజమండ్రి , కాకినాడ , వైజాగ్ నగరాల్లో కనువిందు చేయనున్నారు.