Home Page SliderInternational

ప్రధాని నరేంద్ర మోదీ@UAE

Share with

ప్రధాని నరేంద్ర మోదీ గతరెండు రోజులుగా ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా ఫ్రాన్స్ పర్యటనను ముగించుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మోదీ UAE చేరుకున్నారు. కాగా మోదీ అబుదాబిలో ఒకరోజు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ యూఏఈ అధ్యక్షుడు  షేక్ మహ్మద్ బిన్ జియాద్‌తో సమావేశం కానున్నారు. కాగా ఈ సమావేశంలో మోదీ యూఏఈ అధ్యక్షుడితో వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా ఇరు దేశాల ద్వైపాక్షిక సత్సంబంధాలపై మోదీ సమీక్షించనున్నారు. ఈ మేరకు కీలక ఒప్పందాలపై ప్రధాని మోదీ సంతకాలు చేయనున్నారు.