NationalNews

మెగాస్టార్‌కి ప్రధాని మోదీ అభినందనలు

Share with

మెగాస్టార్ చిరంజీవికి గొప్ప ప్రశంస లభించింది. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ చిరంజీవిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి విలక్షణ నటుడని, అద్భుతమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడని మెచ్చుకున్నారు మోదీ.  ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ పురస్కారం చిరంజీవిని వరించింది. ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఈ అవార్డు మన తెలుగు పరిశ్రమకు చెందిన చిరంజీవికి దక్కడం చాలా గొప్పవిషయం. గోవాలోని పనాజీలో ఆదివారం ఇఫి వేడుకలు మొదలయ్యాయి. ఈ వేడుకలు ఈ నెల 29 వరకు జరుగుతాయి. మంచి చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే, సినీ పరిశ్రమకు గొప్పగా సేవలు చేసిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు.