Home Page SliderTelangana

బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించడమే ప్రధాని మోడీ కర్తవ్యం

Share with

వెల్దండ: వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మాదిగ జాతిని ప్రధాని మోడీ అక్కున చేర్చుకున్నారని బీసీ సీఎం పదవికి కట్టుబడి హామీ ఇచ్చి, బడుగు, బలహీనవర్గాల ప్రజలను అధికారంలో భాగస్వాములను చేయాలనే సంకల్పంతో ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. కల్వకుర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తల్లోజు ఆచారి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈటల రాజేందర్ హాజరై మాట్లాడారు. పేదల కష్టాలు తెలిసిన ఛాయ్‌వాలా ప్రధాని అవడంతోనే బలహీనవర్గాల నాయకులకు మంత్రివర్గంలో అవకాశం వచ్చిందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో మొత్తం 74 మంది ఉంటే అందులో 27 మంది బడుగు, బలహీనవర్గాల వారేనని ప్రధాని మోడీ అన్నారు. తల్లోజు ఆచారిని చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. ఐదుసార్లు ప్రజలు ఓడించడం కూడా చాలా బాధేసిందన్నారు.