Home Page SliderTelangana

తుఫ్రాన్ సభలో ప్రధాని: బీజేపీ అభ్యర్థి ఈటలకి భయపడి కేసీఆర్ ఇంకోచోట పోటీకి…

Share with

తుఫ్రాన్ మీటింగ్‌లో ప్రధాని: బీజేపీ నుండి బలమైన అభ్యర్థి ఈటల రాజేందర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తున్నారు అని భయపడి కేసీఆర్ ఇంకో నియోజకవర్గానికి వెళ్లారు.

మల్లిఖార్జున స్వామి పేరు మీద ప్రాజెక్ట్ కట్టి రైతులను రోడ్డున పడవేశారు. ఆ మల్లిఖార్జునుడు, రైతులు కేసీఆర్‌ని క్షమించరు.

…****  ****…

తుఫ్రాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు హాజరైన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్. దుబ్బాక గెలుపు కేసీఆర్‌కి షాక్ ఇచ్చింది. ఆ దుబ్బాక గెలుపు విస్తరించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా బీజేపీ పేరే వినిపిస్తోంది. కేసీఆర్ డబ్బు, మద్యం, అహంకారానికి సమాధానం చెప్పే రోజు డిసెంబర్ 3. బీజేపీను గెలిపించడానికి ప్రజలే సిద్ధమయ్యారు. మెదక్‌లో అత్యధిక సీట్లు గెలిచేది బీజేపీ.

బీజేపీలో చేరితే డబుల్ బెడ్ రూమ్, పెన్షన్ పోతది అని చెప్తున్నారట.. మిస్టర్ హరీష్, మిస్టర్ కేసీఆర్ ఇది మీ అబ్బ జాగీరా? మీరు ప్రజల ఆస్తులకు కాపలాదారులు మాత్రమే. ప్రజలకు మీరు జీతగాళ్ళు మాత్రమే. కేసీఆర్ ఇంటికి పోవడం ఖాయం. వాళ్లు ఇచ్చే ప్రొసీడింగ్ కాపీలు మూడవ తారీఖు తరువాత చెల్లవు.

బీజేపీ గెలిస్తే మోటర్లకు మీటర్లు వస్తాయి అని అరిగిపోయిన రికార్డ్ వేస్తున్నారు. పాడిందే పాడరా పాచిపళ్ల… అన్నట్టు పాడుతున్నారు. వచ్చాయా దుబ్బాకలో, హుజూరాబాద్‌లో మీటర్లు? వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా. ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఉందా? బీజేపీ వస్తే పెన్షన్ పోదు. ముసలివాళ్లు ఇద్దరికీ ఇస్తాం. కౌలు రైతులు చచ్చిపోతే పట్టించుకోని కేసీఆర్..

పక్క రాష్ట్రాల రైతులకు పంచిపెడుతున్నారు. మీ గ్రామాల్లో డ్రిప్, స్ప్రింక్లర్, పదిళ్లకు, ట్రాక్టర్స్‌కి ఇచ్చే సబ్సిడీ బంద్ పెట్టారు. బీజేపీ వస్తే అన్ని సబ్సిడీ పరికరాలు పునరుద్ధరిస్తాం. దేశంలో వరికి మద్దతు ధర 2160 రూపాయలు చేశారు. పదేళ్లలో ఎంఎస్పీని డబుల్ చేసిన మహనీయుడు మోదీ. తెలంగాణలో 4వ తారీఖు తర్వాత ధాన్యం 3100 రూపాయలు అందిస్తాం. యువకులారా ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాబోయేది బీజేపీ ప్రభుత్యం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని ఈటల రాజేందర్ అన్నారు.