Home Page SliderInternational

బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న అమెరికా ప్రెసిడెంట్

Share with

అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడన్ ఎంత బిజీగా ఉంటారో మనకందరికీ తెలుసు. అయితే అలాంటి జో బైడన్ తన బిజీ షెడ్యూల్స్ పక్కన పెట్టి కాస్త రిలాక్స్ అవుతున్నారు. కాగా ఆయన తాజాగా డెలవార్‌లోని రెహోబోత్ బీచ్‌ను సందర్శించి అక్కడ సరదాగా గడిపారు.ఈ సందర్భంగా జో బైడన్ షర్ట్ తీసేసి,కూలింగ్ గ్లాసెస్,క్యాప్ పెట్టుకొని అచ్చం హాలీవుడ్ హీరోలా కన్పించారు. ఈ సమయంలో ఓ జర్నలిస్ట్ బైడన్ లుక్‌ను తన కెమెరాలో బంధించారు. అంతేకాకుండా బీచ్ డేని ఆస్వాదిస్తున్న ప్రెసిడెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.