Home Page SliderNational

‘ఓ భర్త కథ’-భార్యకు భరణం కోసం కిడ్నీ అమ్మకానికి సిద్ధం

Share with

గృహహింస భార్యకే కాదు. భర్తకు కూడా భరించలేని విషయం. ‘ఇంటిలోని పోరు ఇంతింత కాదయా’ అన్నట్లు భార్య, అత్తమామలు చేసే వేధింపులు తాళలేక విడాకులు కోరుకున్నాడో వ్యక్తి. అయితే విడాకులు ఇవ్వాలంటే 10 లక్షలు డిమాండ్ చేశారు వారు. పోలీసులను, అధికారులను పలుమార్లు సంప్రదించినా అతనికి ఫలితం లేకపోయింది. దీనితో కిడ్నీ విక్రయించి అయినా ఆ డబ్బు భార్యకు ఇచ్చి విముక్తి పొందాలని భావిస్తున్నాడు పట్నాకు చెందిన సంజీవ్. అతనికి ఆరేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి అతనికి కష్టాలు మొదలయ్యాయి. బావమరిది, భార్య, అత్తమామల వేధింపులు తట్టుకోలేక సంసార బంధం నుండి బయటపడాలనుకున్నాడు. వారు డబ్బు అడగడంతో కిడ్నీ అమ్మాలనే నిర్ణయానికి వచ్చాడు. ఒకవేళ కిడ్నీ విక్రయించలేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాపోతున్నాడు.

మూత్రపిండం అమ్మకానికి సిద్ధంగా ఉందని బ్యానర్ చేతిలో పట్టుకుని ఫరీదాబాద్‌లో తిరుగుతున్నాడు. లేకపోతే ఈ నెల 21న పట్నాలో ఆత్మాహుతి కార్యక్రమం ఉందని, దానికి రాష్ట్రపతి, ప్రధాని, బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ హాజరు కావాలంటూ అభ్యర్థిస్తూ బ్యానర్‌పై రాయించాడు. బ్యానర్‌కు మరోవైపు భార్య, బావమరిది, ఫొటోలను కూడా ముద్రించాడు.