Andhra PradeshHome Page Slider

ఏపీలో పోలింగ్ శాతం 80.66%

Share with

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ 80.66 శాతం నమోదయ్యింది. ఇక జిల్లాల వారీగా పర్సంటేజ్ విడుదల చేయాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ 1.1 శాతం కలుపుకొని, మొత్తం ఓట్ పర్సంటేజ్ 81.76గా తేలింది.

ఈ ఉదయం 5 గంటలకు ఎన్నికల సంఘం వారు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతాన్ని 81.86 శాతంగా అధికారికంగా ప్రకటించారు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం EVMలలో పొలైన ఓట్లు 3,33,40,560

అందులో పురుషుల ఓట్లు 1,64,30,359.

మహిళల ఓట్లు 1,69,08,684.

ట్రాన్స్జెండర్ల ఓట్లు1517.

EVM లో పోలైన ఓట్లు మొత్తం 80.66 శాతం

పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు 4,44,216 (ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగస్తుల ఓట్లు)

హోమ్ ఓట్ ఆప్షన్ ద్వారా పాలైన 53,573 ( వృద్ధులు వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యం తో ఉన్న వారి ఓట్లు)

ఈ మొత్తం శాతం 1.20

మొత్తం గా EVM+Postal Ballot+ Home Vote

80.66+1.20=81.86

ఇది 2019 ఎన్నికల శాతం తో పోలిస్తే 2.12 శాతం ఎక్కువ