Home Page SliderTelangana

ప్రధాని మోదీది గాడ్సే పాలన: కేటీఆర్

Share with

తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు.కాగా ఈ రోజు సూర్యాపేట జిల్లాలో అర్హులైన లబ్దిదారులకు మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు.అనంతరం ఆయన అర్హులైన వారికి దళిత బంధు చెక్కులను కూడా అందజేశారు. అంతేకాకుండా సూర్యాపేటలో ఐటీ హబ్ సహ మహిళా కమ్యూనిటీ హాల్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ కావాలంటే ఏఈ,డీఈకి ఫోన్ చేయాల్సి వచ్చేది అన్నారు. పైగా 3 గంటలకు మించి కాంగ్రెస్ పార్టీ కరెంటు  ఇవ్వలేదని కేటీఆర్ తెలిపారు. అయితే తెలంగాణాలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి వారంటీ పూర్తయ్యి 100 ఏళ్లు అయ్యిందన్నారు.కాబట్టి వారంటీ లేని పార్టీ గ్యారెంటీలు ఇస్తే కుదరదని కేటీఆర్ స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన అని ప్రధాని మోదీ ఎప్పుడు విమర్శిస్తుంటారు. అవును నిజమే మాది కుటుంబ పాలనే..అయితే తెలంగాణాలోని రైతులే మా కుటుంబం అని కేటీఆర్ వెల్లడించారు.కాగా బీఆర్ఎస్ పార్టీది గాంధీ వారసత్వం..దేశంలో బీజేపీది గాడ్సే వారసత్వం అని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.