Home Page SliderInternational

ఫ్రాన్స్ అధ్యక్ష దంపతులకు ప్రధాని మోదీ ‘అపురూప కానుకలు’

Share with

ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటన ముగింపు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్ష దంపతులకు అపురూప కానుకలందించారు. భారత సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అపూర్వ కానుకలను మోదీ గతంలో కూడా వివిధ దేశాల అధ్యక్షులకు అందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు చందనపు చెక్కతో తయారు చేసిన సితార వాయిద్యాన్ని కానుకగా అందించారు. అలాగే ఆయన సతీమణి బ్రిగెట్టికి తెలంగాణ సంప్రదాయ పోచంపల్లి ఇక్కత్ సిల్క్ చీరను అందజేశారు. ఈ కానుకలు వారినెంతగానో అలరించాయి. వారు కూడా ప్రధానికి మర్యాదపూర్వకంగా  పలు కానుకలందజేశారు.

నిన్న జరిగిన  ఫ్రాన్స్ నేషనల్ డేలో ‘బాస్టిల్ డే పరేడ్‌’లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా ఆయనకు అత్యున్నత సైనిక, పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ లభించింది. దీనితో  అధ్యక్షుడు మెక్రాన్ ప్రధాని మోదీని సత్కరించారు. ఈ వేడుకలను చూడడం తనకెంతో సంతోషంగా, అద్భుతంగా ఉందని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాగే మెక్రాన్‌తో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు దీనిలో భారత్, ఫ్రాన్స్‌లు ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటూ కామెంట్ పెట్టారు మోదీ. ఈ పరేడ్‌లో ఫ్రాన్స్ వాయుసేనతో పాటు భారత్ రఫేల్ విమానాలు కూడా సందడి చేశాయి. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ నేడు యూఏఈకి బయలుదేరారు. అబుదబీలో పర్యటించి, అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయోద్‌తో చర్చలు జరుపుతారు.