Home Page SliderTelangana

ప్లీజ్.. మా వాళ్లను సైన్యంలోకి పంపకండి: నేపాల్

Share with

కాఠ్‌మండూ: రష్యా సైన్యంలో పోరాడుతూ తన దేశీయులు ఆరుగురు మృతి చెందడంపై నేపాల్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ వాళ్లను సైన్యంలోకి పంపవద్దని రష్యాను కోరింది.

తన దేశీయులను సైన్యంలోకి తీసుకోవద్దని రష్యాను నేపాల్ కోరింది. ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వర్తిస్తోన్న వారిని తిరిగి తమ దేశానికి పంపివేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి నేపాలీ గూర్ఖా యువకులు రెండు పక్షాల తరఫునా పోరాడుతున్నారు. యుద్ధంలో పాల్గొంటున్న ఏ దేశ సైన్యంలోనూ చేరవద్దని తన పౌరుల్ని కోరిన నేపాల్. నేపాల్ ప్రకటనపై రష్యా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.