Home Page SliderNational

దయచేసి నన్ను బ్రతికుండగానే చంపకండి:స్టార్ కమెడియన్

Share with

టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్ సుధాకర్ అంటే తెలియనివారు ఎవరు ఉండరనే చెప్పాలి. సూర్యవంశం,సంక్రాంతి,రాజా వంటి సూపర్ హిట్ సినిమాలతోపాటు మరెన్నో సినిమాల్లో నటించి తన కామెడీతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు సుధాకర్. ఈ విధంగా తన కామెడీ టైమింగ్‌తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని కొద్ది కాలంలోనే స్టార్ కమెడియన్‌గా పేరు సంపాదించారు. అయితే ఈ మధ్య కాలంలో కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ.. సోషల్ మీడియోలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా ఆయన తాజాగా దీనిపై స్పందించారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఆయనే స్వయంగా ఓ వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సుధాకర్ మాట్లాడుతూ..నా మీద వచ్చినవన్నీ అసత్య వార్తలే. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఆయన వీడియోలో స్పష్టం చేశారు. కాగా 1980,90ల్లో స్టార్ కమెడియన్‌గా ఉన్న సుధాకర్ 2010లో తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఆయన కోలుకొని ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కూడా చనిపోయారంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇలానే ఈ వీడియో క్లిప్ విడుదల చేసి తాను చనిపోలేదని ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.