Home Page SliderTelangana

దయచేసి నన్ను చూడడానికి రాకండి..కేసీఆర్ విజ్ఞప్తి

Share with

తనను చూడడానికి ఆసుపత్రికి వచ్చే కార్యకర్తలకు, బీఆర్‌ఎస్ నాయకులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తనను చూడడానికి ఆసుపత్రికి రావొద్దని, తానే త్వరలో వస్తానని సందేశం పంపారు. తాను కోలుకుంటున్నానని, ఎవ్వరూ ఆందోళన పడవద్దని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో ఆసుపత్రికి రావడం వలన, వందలాదిమంది రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పోలీసుల పహారాలు, భద్రతల విషయంలో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. దయచేసి, పార్టీ శ్రేణులు, అభిమానులు సహకరించాలని, తనను అభిమానించే ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని సందేశం పంపారు.