Home Page SliderTelangana

హైదరాబాద్‌లో పర్సనల్ డేటా చోరీ చేసే ముఠా అరెస్ట్

Share with

మన దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లు వాళ్లకు ఉన్న అన్నీ వనరులను తెలివిగా ఉపయోగించుకుంటూ..అనేక విధాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. దీనిలో భాగంగా కొందరు సైబర్ నేరగాళ్లు వ్యక్తుల నుంచి డబ్బులు మాయం చేస్తుంటే..మరికొందరు మాత్రం ఏకంగా వ్యక్తుల పర్సనల్ డేటాను చోరీ చేస్తున్నారు. ఇలా చోరీ చేసిన పర్సనల్ డేటాను విక్రయిస్తున్న ఓ ముఠాను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  వీరు దేశంలోని దాదాపు 16కోట్ల మంది పర్సనల్ డేటాను లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ 16 కోట్ల మందిలో బీమా ,లోన్‌కు అప్లై చేసినవారు 4 లక్షలు,ఆర్మీకి చెందినవారు 2.5 లక్షలు,ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగులు 35 వేలమంది ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా వీరందరి నుంచి వారి fb యూజర్ id-పాస్‌వర్డ్‌ల డేటా లీకైనట్లు పోలీసులు తెలిపారు. ఇంతే కాకుండా బిల్లు పే చేయలేదని ,ఫోన్లు ,మెసేజ్‌లు చేస్తూ కూడా మహిళలకు సంబంధించిన పర్సనల్ డేటా చోరీ చేసారని పోలీసులు స్పష్టం చేశారు.  కాగా వీటి విషయమై  ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.  తమ మొబైల్స్‌కు వచ్చే అనవసరమైన ఫోన్లు,మెసేజ్‌లను స్వీకరించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.