Andhra PradeshHome Page Slider

వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి-అవినాష్ రెడ్డి

Share with

వివేకా హత్య జరిగిన రోజు శివప్రకాష్ రెడ్డి ఫోన్ ద్వారా మాత్రమే, తనకు మర్డర్ వ్యవహారం తెలిసిందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వివేకా మరణించినట్టు శివప్రకాష్ రెడ్డి చెప్పారన్నారు. ఉదయం ఆరున్నరకు తనకు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేశారన్నారు. అప్పటి వరకు వివేకా ఎలా చనిపోయారో కూడా తెలియదన్నారని. అప్పటికే తాను జమ్మలమడుగు బయల్దేరానని చెప్పారు. పులివెందుల రింగ్ రోడ్ దగ్గర ఉన్న సమయంలో తనకు కాల్ వచ్చిందన్నారు. అక్కడ ఏదైనా అనుమానాస్పదంగా ఉందా అని విచారించానన్నారు. మేము అక్కడికి వెళ్లకముందే వివేకా రాసిన లేఖ, మొబైల్ దాచిపెట్టారన్నారు . డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని వివేకా లేఖలో రాసినట్టు చెప్పారు. హత్య అని తేల్చే లేఖను ఎలా దాచిపెడతారని ప్రశ్నించారు అవినాష్.

సీబీఐ ఆఫీసర్ రాంసింగ్ ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అవినాష్ ఆరోపించారు. హత్య తర్వాత ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అంటూ తాను వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిని అడిగానన్న అవినాష్, ఎలాంటి అనుమానాల్లేవని చెప్పారన్నారు. లెటర్ దాచిపెట్టమని నేనే చెప్పానని సునీత పోలీసులకు ఎందుకు చెప్పలేదన్నారు అవినాష్. వివేకా చనిపోయారని, చాలా బ్లడ్ ఉందని మాత్రమే తాను సీఐకి చెప్పానన్నారు. మొత్తంగా వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రపంచానికి తెలియాలన్నారు అవినాష్ రెడ్డి. వివేకా హత్య చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయని, చనిపోయిన వ్యక్తి గురించి మట్లాడొద్దనే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామన్నారు. సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాలనే తాము మాట్లాడుతున్నామన్నారు.