Home Page SliderTelangana

తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తారు: కిషన్ రెడ్డి

Share with

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వరంగల్ పర్యటన సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అవినీతి గురించి అర్థమైందన్నారు. అందుకే అధికార పార్టీలో భయం పట్టుకుందన్నారు.త్వరలోనే తెలంగాణలోని అన్ని వర్గాలు సంపూర్ణంగా బీఆర్ఎస్‌ను బహిష్కరించబోతున్నాయన్నారు. దేశంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని అన్నారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు భవిష్యత్ లేదన్న ఆయన ఈ రెండు పార్టీల నిర్లక్ష్యం కారణంగానే ఇన్నాళ్లూ తెలంగాణ అన్యాయానికి గురైందని అన్నారు. మజ్లీస్ పార్టీ తో కలిసి గుండాయిజం, రౌడీయిజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అసెంబ్లీ వేదికగా అబద్ధాలతో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు.. ఎంసెట్ పేపర్, పదోతరగతి పేపర్ లీక్, TSPSC పేపర్ లీక్ లను ఆపనందుకు.. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల నిర్వహణను మరిచిపోయినందుకు.. పోలీసుల రిక్రూట్‌మెంట్ జరపనందుకు.. 9 ఏళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనందుకు..నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు.. తెలంగాణ యువత బహిష్కరించేందుకు సిద్దంగా ఉన్నారు.