Andhra PradeshHome Page Slider

శాంతించిన మిగ్‌జాం..కొనసాగుతున్న వర్షాలు

Share with

తీవ్రమైన భారీ తుఫాన్‌గా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను కుదిపేసిన మిగ్‌జాం తుఫాన్ ఎట్టకేలకు శాంతించి, అల్పపీడనంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈశాన్య తెలంగాణ, ఛత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తా తీరాలలో దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంతో పాటు కోస్తాంధ్రలోని పలు జిల్లాలు జలమయమయ్యాయి. బాపట్ల, పల్నాడు జిల్లాలలో వాగులు పొంగి, రాకపోకలు స్థంభించాయి. నెల్లూరు, ఏలూరు, భీమవరం, పాలకొల్లు తదితర నగరాలలో ఇళ్లలోకి నీరు చేరింది. గుంటూరులో  పంటలు నాశనమయ్యాయి. అల్లూరి జిల్లాలో సీతపాడులో లవ్వగెడ్డను దాటేందుకు ప్రయత్నించి ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. కాకినాడ, కోనసీమ జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.