Home Page SliderNational

పవన్ కల్యాణ్‌కి షాక్… రెండో పెళ్లిపై రేణు దేశాయ్ క్లారిటీ..!

Share with

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రెండో పెళ్లి చేసుకోవాలని చాలామంది సలహా ఇచ్చారని ఆమె తెలిపారు. దీంతో కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని  చెప్పారు. అయితే ఆ టైంలో ఆద్యకు 7 ఏళ్లు. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆద్యకు టైమ్ ఇవ్వలేనని భావించి ఆ పెళ్లి రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆద్యకు 13 ఏళ్లు.కాబట్టి ఆమె కాలేజీకి వెళ్లిన తర్వాత పెళ్లి గురించి ,నా గురించి ఆలోచిస్తా అని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.