Home Page SliderInternational

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

Share with

ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. PTI లాయర్ ఫైసల్ చౌదరి ఈ పరిణామాన్ని ధృవీకరించారు. ఇస్లామాబాద్ హైకోర్టును రేంజర్లు ఆక్రమించుకున్నారని, న్యాయవాదులను హింసిస్తున్నారని, PTI వైస్ ప్రెసిడెంట్ ఫవాద్ చౌదరి ట్వీట్ చేశారు. బలగాలు ఇమ్రాన్ ఖాన్ కారును చుట్టుముట్టాయని ఆయన అన్నారు.

ఇమ్రాన్‌ను రేంజర్లు కోర్టు లోపల నుండి అపహరించారని పిటిఐకి చెందిన అజర్ మశ్వాని ఆరోపించారు. తక్షణమే దేశంలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చామన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌ను హింసిస్తున్నారని, కొడుతున్నారని, బలవంతం చేస్తున్నారన్నారు PTI నాయకుడు ముసరత్ చీమా. కోర్టు ఆవరణలో ఇమ్రాన్ ఖాన్ లాయర్ తీవ్రంగా కొట్టారని, ప్రజాస్వామ్యానికి, దేశానికి బ్లాక్ డే అంటూ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.