National

బాధ్యత నుంచి తప్పుకున్న పి.వి.సింధు కోచ్

Share with

భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు , ఆమె కోచ్ పార్క్ సాంగ్ (కొరియా) గురుశిష్యుల బంధం నిన్నటితో ముగిసింది. తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు కోచ్ పార్క్ తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో సింధూ మెరుగైన ప్రదర్శన కనబరచకపోవడానికి కారణం తానేనని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

సింధూతో నా అనుబంధం గురించి అందరూ అడుగుతున్నారు. ఆమె ఇటీవల కాలంలో ఆడిన మ్యాచుల్లో నిరాశపరిచింది. దానికి కోచ్‌గా నేనే బాధ్యత వహిస్తున్నాని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సింధూ మార్పు కోరుతూ..కొత్త కోచ్‌ని వెతుక్కుంటానని చెప్పిందన్నారు. కాబట్టి ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని అనుకుంటున్నానన్నారు. వచ్చే ఒలింపిక్స్ వరకు ఆమెతో ఉండలేక పోతున్నందుకు నన్ను క్షమించండని ఆయన కోరారు. కానీ నేను ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడున్నా ఆమెకు ఎప్పుడూ నా మద్దతు తెలుపుతానని పార్క్ పేర్కొన్నారు. కాగా పార్క్ శిక్షణలో సింధూ ఇప్పటి వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఆయన శిక్షణలో సింధూ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ గెలుపొందింది.