Home Page SliderInternationalSports

క్రికెట్‌లో మరోసారి అత్యంత చెత్త రికార్డు

Share with

ప్రస్తుతం జరుగుతున్న టీ20ల్లో ఆటగాళ్లు ముందెన్నడూ లేని విధంగా అత్యంత చెత్త రికార్డులను నమోదు చేస్తున్నారు. మొన్నటివరకు టీమ్‌ఇండియా ప్లేయర్ సూర్యకుమార్ యూదవ్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యి చెత్త రికార్డును నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం ఆ రికార్డును పాకీస్థానీ ప్లేయర్ అబ్దుల్లా షఫీఖ్ అధిగమించాడు. టీ20ల్లో వరుసగా 4 మ్యాచుల్లో డకౌట్ ఆయిన తొలి ఆటగాడిగా నిలిచారు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన 2 టీ20ల్లో రెండో బంతికే డకౌట్ అయిన ఇతను..ఆఫ్ఘాన్‌లో తొలి మ్యాచ్‌లో 2 బంతులకు ,రెండో మ్యాచ్‌లో మొదటి బంతికే వెనుదిరిగారు. గతంలో క్రికెట్‌లో సెంచరీలతో రికార్డులు సృష్టించే ఆటగాళ్ళు ప్రస్తుతం డకౌట్‌లతో రికార్డులు సృష్టిస్తున్నారు.