Home Page SliderInternational

చందమామకు మరోవైపు మట్టిని తొలిసారి భూమికి తెచ్చిన చైనా వ్యోమనౌక

Share with

చైనా వ్యోమనౌక చంద్రుని ఆవలివైపు విజయవంతంగా దిగిన సంగతి తెలిసిందే. అక్కడి నుండి మట్టిని, శిథిలాలను తొలిసారి భూమిపైకి తీసుకువచ్చింది చాంగే-6. ఈ ల్యాండర్ సురక్షితంగా ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో దిగింది. ఈ వ్యోమనౌక మే 3 నుండి 53 రోజుల పాటు ప్రయాణించి, జూన్ 2న జాబిల్లిని చేరుకుంది. జూన్ 2న జాబిల్లి ఆవలివైపున సౌత్ పోల్ -అయిట్కిన్ అనే ప్రాంతంలో అపోలో బేసిన్‌లో చంద్రునిపై దిగింది. దీనిలో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే నాలుగు భాగాలు ఉన్నాయి. డ్రిల్లింగ్ యంత్రాల నుపయోగించి రోబోటిక్ హస్తం సహాయంతో తవ్వకాలు జరిపి మట్టి నమూనాలు సేకరించింది. దీనిని బట్టి చంద్రుని ఆవలివైపు రహస్యాలు కనిపెట్టే ఉద్దేశంలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వీటిని అధ్యయనం చేస్తే చంద్రునికి రెండువైపులా ఉండే భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.