Home Page SliderNational

ఒడిశా రైలు ప్రమాదం..స్కూల్‌ను కూల్చిన వైనం

Share with

ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొనడంతో 288 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. అంతేకాకుండా 1100 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహలను అధికారులు ఒడిశాలోని బహనాగలోని ప్రభుత్వ స్కూల్లో ఉంచారు. కాగా ఈ స్కూల్‌ను అధికారులు ఇవాళ కూల్చివేశారు. ఎందుకంటే ఈ పాఠశాలలో మృతదేహాలను ఉంచడంతో పిల్లలు ఈ స్కూల్‌కు రావడానికి భయపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను మృతదేహాలను ఉంచిన స్కూల్‌కు పంపలేమని తెలిపారు. ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో చాలామంది మృత్యువాత పడగా..వారి శవాలను దగ్గరల్లో ఉన్న బహనాగ పాఠశాల్లో తాత్కాలికంగా ఉంచారు. తర్వాత వాటిని భువనేశ్వర్ ఆస్పత్రికి తరలించి..ఆ పాఠశాలను శుభ్రం చేశారు. అయినప్పటికీ అక్కడి విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో భయం తగ్గలేదు. దీంతో ఈ స్కూల్‌ను కూల్చేయాలని గ్రామస్థులు ,స్కూల్ యాజమాన్యం ఉన్నతాధికారులను కోరారు. దీంతో 65 ఏళ్ల క్రితం నిర్మించిన బహనాగ ప్రభుత్వ పాఠశాలను అధికారులు కూల్చివేసినట్టు తెలుస్తోంది.