NewsTelangana

రామ్‌చరణ్ బర్త్‌డే పార్టీలో ఎన్టీఆర్ మిస్సింగ్.. ఎందుకంటే?

Share with

నిన్న రాత్రి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందుతున్న రామ్‌చరణ్ బర్తడే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చిరంజీవి, రామ్‌చరణ్ కుటుంబసభ్యులు, అనేక మంది సినిమా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. RRR సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలోని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంలో హీరో రామ్‌చరణ్ పుట్టినరోజు రావడంతో చాలా సందడిగా సంబరాలు జరుపుకున్నారు. ఐతే  RRR చిత్రంలో రామ్‌చరణ్‌తో పాటు నటించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీలో కనిపించలేదు. వీరిద్దరూ మంచి మిత్రులన్న నిజం అందరికీ తెలుసు. దీనితో ఎన్టీఆర్ మిస్సవడంతో నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. దీనికి పెద్ద గుసగుసలాడాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్‌లో ఉండడం వల్లే ఈ పార్టీకి రాలేకపోయారని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి మేనల్లుడైన అల్లు అర్జున్ కూడా ఈ పార్టీకి గైర్హాజరయ్యాడు.