Andhra PradeshHome Page Slider

వైసీపీ ఆఫీసులకు నోటీసులు- హైకోర్టులో కేసు

Share with

వైసీపీ ఆఫీసులకు, కార్యాలయాలకు ప్రభుత్వం వరుసగా నోటీసులు ఇస్తోంది. వాటిని అనుమతి లేకుండా నిర్మించారంటూ రచ్చ చేస్తోంది. ఈ విషయంపై వైసీపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు నేడు స్టేటస్‌కో విధించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని 10 వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందాయి. కొన్నిచోట్ల కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాలను కోర్టులో వైసీపీ పార్టీ ప్రస్తావించగా, రేపు ఈ పిటిషన్‌ను విచారిస్తామని అంతవరకూ స్టేటస్‌కో కొనసాగుతుందని న్యాయస్థానం పేర్కొంది. ఈ ఎన్నికలలో ఓటమి అనంతరం తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ప్రతీ జిల్లాలో వైసీపీ కార్యాలయం నిర్మాణాలలో ఉందని, అనుమతులు లేకుండా విలాసవంతంగా వీటిని నిర్మిస్తున్నారని ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.