Home Page SliderTelangana

మాజీ మంత్రుల పేరుతో కొత్త పాఠ్యపుస్తకాలు…తిరిగి వెనక్కి

Share with

తెలంగాణ స్కూలు విద్యార్థులకు అందించిన పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ పుస్తకాల ముందుమాట పేజీలలో విద్యాశాఖామంత్రిగా గత మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు ఉన్నాయి. అంతేకాక అప్పటి ఇతర అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. దీనితో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాక 1 నుండి 10 వ తరగతి తెలుగు వాచకంలో వీరి పేర్ల వెనుక పేజీలలో వందేమాతరం, జాతీయగీతం, ప్రతిజ్ఞ కూడా ఉన్నాయి. ఈ పేజీని తొలగించి ఇవ్వాలని ముందుగా ఆదేశాలు వచ్చాయి. కానీ ఈ పేజీని తొలగిస్తే జాతీయగీతం కూడా పాఠ్యపుస్తకంలో ఉండదు. దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే ఈ పేజీని మార్చకుండా పుస్తకాలు పంపిణీ కావడంతో విద్యాశాఖ ఈ పాఠ్యపుస్తకాలను, వర్క్‌బుక్‌లను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.