International

దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విక్టరీ

Share with

టీ 20 వరల్డ్ కప్ లో అద్భుతాలు కొనసాగుతున్నాయ్. పటిష్టమైన జట్లు పిల్లకూనల చేతిలో ఓటమి పాలవుతూనే ఉన్నాయ్. తాజాగా దక్షిణాఫ్రికా.. చిన్న జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆడిలైడ్ లో జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రంగాల్లోనూ సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్ బ్రండన్ గ్లోవర్ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు.