Andhra PradeshHome Page Slider

వేతనాల కోసం పొరుగు సేవల సిబ్బంది ఆందోళన

Share with

శ్రీశైలం ఆలయం: శ్రీశైలం దేవస్థానం ఉద్యానవనం విభాగంలో పనిచేసే పొరుగు సేవల ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సుమారు 160 మంది పొరుగు సేవల ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. పొరుగు సేవల ఉద్యోగులు ఉదయాన్నే దేవస్థానం ఉద్యాన వనం విభాగం ఆఫీస్ వద్దకు చేరుకుని గుడిలోనికి వెళ్ళకుండా బయటనే నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించాలని దేవస్థానం అధికారులు, ఏజెన్సీ యాజమాన్యాన్ని ఎండీ రాజశేఖర్‌ను పలుమార్లు కోరినప్పటికీ స్పందన లేదని సిబ్బంది పేర్కొన్నారు. దసరా పండుగ లోపు తమకు వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా వేతనాలు అందని విషయాన్ని పొరుగు సేవల సిబ్బంది శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ లక్ష్మణ్‌రావుకు ఫిర్యాదు చేశారు.