Home Page SliderNational

“నీట్ పేద విద్యార్థుల కోసం కాదు ఉన్నత వర్గాల కోసం”:రాహుల్ గాంధీ

Share with

దేశంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. కాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పేద విద్యార్థులు నీట్ ఎగ్జామ్‌పై నమ్మకం కోల్పోయారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నీట్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఏళ్లపాటు కష్టపడి చదువుతారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రొషెషనల్ ఎగ్జామ్‌ అయిన నీట్‌ ఎగ్జామ్‌ను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చిందని రాహుల్ ఆరోపించారు. మోదీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. నీట్ ఎగ్జామ్ పేద విద్యార్థుల కోసం కాదు ఉన్నత వర్గాల కోసమని మోదీ ప్రభుత్వం నిరూపించిందన్నారు. దేశంలో నీట్ పరీక్ష విధానంలో అనేక లోపాలున్నాయని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.