NationalNews

నీట్‌లో భళా.. తెలంగాణ విద్యార్థికి 5వ ర్యాంక్

Share with

ప్రతిష్టాత్మక నీట్ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు ప్రతిభకనబర్చారు. తెలంగాణ బిడ్డ ఎర్రబెల్లి సిద్ధర్థరావు నీట్‌లో 711 మార్కులు సాధించి 5వ ర్యాంక్ పొందాడు. ఇక పోటీ పరీక్షలో ఏపీ బాలిక మట్టా దుర్గా సాయికీర్తి 710 మార్కులతో పన్నెండో ర్యాంక్ సాధించింది. నూనె వెంకట సాయి వైష్ణవి 12వ ర్యాంక్, హర్షవర్థన్ నాయుడు 25 ర్యాంకు సాధించారు. ఇక ప్రత్యేకంగా బాలికల పరంగా చూస్తే… వైష్ణవి 6, లక్ష్మీ చరిత 14, వరుం అతిథి 20 వ స్థానంలో నిలిచారు. నీట్ 2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. జులై 17న రాసిన పరీక్షలో 56.27 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ నుంచి పరీక్ష రాసిన 59,296 మంది విద్యార్థుల్లో 35,148 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఏపీ నుంచి 65,305 మంది పరీక్ష రాస్తే… 40,344 మంది పాసయ్యారు. దేశ వ్యాప్తంగా పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది నీట్‌కు అర్హత సాధించారు.