NationalNews Alert

చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

Share with

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ భారత స్టార్ జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో భారీ విజయాన్ని అందుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్ ట్రోఫీలో విజేతగా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు.

స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో నిన్న మెన్స్ జావెలిన్ డైమండ్ లీగ్ ఫైనల్ పోటీ జరిగింది. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాడ్లెక్, జర్మనీకి చెందిన జులియన్ వెబ్బర్‌ను దాటుకుని నీరజ్ విజేతగా నిలిచాడు. నీరజ్ 88.44 మీటర్లు జావెలిన్ విసిరి మొదటి స్థానం సంపాదించి, డైమండ్ ట్రోఫీ గెలుపొందాడు. చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాడ్లెక్ రెండో సారి 86.94 మీటర్లు థ్రో చేశాడు. దీంతో మిగతా ఆటగాళ్లకంటే మెరుగైన ప్రదర్శన చేసి నీరజ్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. 2018లోను డైమండ్ లీగ్‌కు అర్హత సాధించిన నీరజ్… ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయాడు.ఈ సారి మరింత కసితో బరిలోకి దిగిన నీరజ్ ట్రోఫీ సోంతం చేసుకున్నాడు.