Home Page SliderTelangana

నవనారసింహులు…9 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్

Share with

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ కసరత్తు తీవ్రతరం చేస్తోంది. అభ్యర్థుల్ని కేవలం గెలుపు ఆధారంగా ఎంపిక చేయాలని భావిస్తున్న హైకమాండ్.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే ప్రతి సీటు కూడా ముఖ్యమని భావిస్తోంది. అందుకోసం పార్టీ అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో 17 మంది అభ్యర్థులకు గాను మొదటి జాబితాలో 9 మందితో ప్రకటన విడుదల కానుంది.

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు దాదాపు ఖరారవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 9 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు బిజెపి హైకమాండ్ తొలి జాబితా విడుదల చేయబోతోంది. ఆదిలాబాద్-సోయం బాపూరావు, నిజామాబాద్-ధర్మపురి అర్వింద్, కరీంనగర్-బండి సంజయ్, సికింద్రాబాద్- జి. కిషన్ రెడ్డి, మల్కాజ్‌గిరి-ఈటల రాజేందర్, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, మెదక్-ఎం. రఘునందన్ రావు, మహబూబ్‌నగర్-డీకే అరుణకు ఛాన్స్ దాదాపు ఖాయమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పది లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్న బీజేపీ అందుకు తగినట్టుగా కసరత్తు చేస్తోంది.

తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలందరికీ మరోసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మొదటి నుంచి ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపూరావు స్థానంలో, వేరేవారికి అవకాశం ఇస్తారన్నట్టుగా చర్చలు సాగుతున్నప్పటికీ ప్రస్తుతం ఆ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ టికెట్ సంపాదించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే నిజామాబాద్ నియోజకవర్గమంతటా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేయాల్సిందిగా కోరుతున్నారు. ఇక కరీంనగర్ నుండి బండి సంజయ్ ఈసారి విజయం ఖాయమని విశ్వాసంగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. నియోజకవర్గంలో ఆయన పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతుననట్టు చెబుతున్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ గెలుపు ఖాయమని పార్టీ కూడా భావిస్తోంది. ఇక సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు.

ఇక మొదటిసారి లోక్ సభకు బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ సైతం పోరాడుతున్నారు. ఆయనకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానాన్ని పార్టీ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ అహంకారంపై తిరుగుబాటు చేసి, తెలంగాణలో తొలిసారి ప్రజలకు ప్రజాస్వామ్యభావనను కలిగించిన ఈటల, ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కా్‌జ్‌గిరి నుంచి బరిలో దిగబోతున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనా నియోజకవర్గంగా ఉన్న మల్కా‌జ్‌గిరిలో సుమారు 36 లక్షల మంది ఓటర్లున్నారు. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మొదట్నుంచి బీజేపీకి సానుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఈటల రాక కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు.

ఇక చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉంది. ఆయనకు చేవెళ్ల సీటు దాదాపు కన్ఫామ్ అని చెబుతున్నారు. గత ఎన్నికల స్వల్ప ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన విశ్వేశ్వర్ రెడ్డి ఈసారి బీజేపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో పోటీ ఎక్కువగా ఉంది. డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఈసారి డీకే అరుణకు సీట్ ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక నల్గొండ నుంచి బూరా నరసయ్య గౌడ్‌కు సీట్ కన్ఫామ్ దాదాపు ఖాయమని చెప్తున్నారు. ఆయన ఇప్పటికీ నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ ప్రచారం కూడా మొదలుపెట్టారు.