Home Page SliderNational

జాతీయ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్

Share with

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ సినిమా అల్లు అర్జున్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా పుష్ప సినిమాలో తన నటనకు గాను అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్‌ను అందుకున్నారు. కాగా ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. తెలుగు సినీ చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. అయితే జాతీయ ఉత్తమ నటిగా ఆలియా(గంగూభాయ్ కతియావాడి),కృతి సనన్(మిమి) అవార్డు అందుకున్నారు.