Home Page SliderTrending Today

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాని సాంగ్

Share with

నాని,కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలోని “చమ్కీల అంగీలేసి” పాట కూడా ప్రస్తుతం యూట్యూబ్‌లో దుమ్ము రేపుతుంది. కాగా ఈ పాట యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.110 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేతకాకుండా ఈ సినిమా నేచురల్ స్టార్ నాని కేరీర్‌లోనే అమెరికాలో 2 మిలియన్ డాలర్లు కలెక్షన్లు సాధించినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. దీంతో  ఈ సినిమాతోపాటు సాంగ్ కూడా భారీ సక్సెస్‌ను సాధించడంతో చిత్రబృందం సంబరాలు చేసుకుంటున్నారు.  అయితే ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. కాగా ఈ సక్సెస్ మీట్‌లో మూవీ నిర్మాత దర్శకుడికి BMW కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.