Andhra PradeshHome Page Slider

అగ్నికి ఆహుతవుతున్న ‘నల్లమల అడవి’

Share with

గత మూడు రోజులుగా కార్చిచ్చులు  నల్లమల అడవిని దహించివేస్తోంది. అటవీ సిబ్బంది అతి ప్రయాసతో మంటలను అదుపులో తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రదేశంలోని జీలుగాయికుంట, లంబడోని ఉతారు, ఈర్లపడేలు, సుద్ధబొక్కలలో 6 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. మద్దిమడుగు, అమ్రాబాద్, లింగాల, దోమలపెంట వంటి ప్రాంతాలలో ఈ సంవత్సరంలోనే 8 సార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 150 ఎకరాల అటవీప్రాంతం మంటలకు ఆహుతయ్యింది. నాలుగు అడవీరేంజ్‌లలో మంటలు చెలరేగాయి.

ఇప్పపువ్వు సేకరించేవారు గడ్డికి నిప్పు పెట్టారేమో అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు అటవీ అధికారులు. ఎందుకంటే గడ్డి భూముల వద్ద ఎలుగుబంట్లు పొంచి ఉంటాయి. ఈ పూలు సేకరించడానికి వెళ్లేవారికి వారికి ప్రమాదం జరగకుండా జంతువుల బారినుండి రక్షించుకోవడానికి నిప్పు పెట్టారా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. దీనికి తోడు ఎండల వేడికి కూడా ఈ మంటలు అదుపులోకి రావడం లేదు. చిన్నచిన్న జంతువులు, పాములు, వన్యప్రాణులకు ఈ అగ్నికీలలు చాలా ప్రమాదం కలుగజేస్తాయి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు  కోరుతున్నారు.