NewsTelangana

తెలంగాణా సర్కార్‌పై నల్లాల ఓదేలు ఆగ్రహం

Share with

తాను ఇంట్లోలేని సమయంలో అధికార పార్టీ నేతలు వచ్చి ఇంట్లో హంగామా చేసి వెళ్ళారని ఓదేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నల్లాల ఓదేలు ప్రభుత్వ విప్‌గా పనిచేసేటప్పుడు ఆయనకు క్వార్టర్స్‌లో ఉండటానికి తెలంగాణా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ఆయన ఈ మధ్య టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీంతో తెలంగాణా ప్రభుత్వం క్వార్టర్స్ ఖాళీ చేయాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నల్లాల ఓదేలు క్వార్టర్స్ ఖాళీ చేయాల్సివుంది. అయితే తాను ఆ పనిలోనే ఉన్నానని నల్లాల ఓదేలు స్పష్టం చేశారు. కాబట్టి అధికార పార్టీ ఇలాంటి దౌర్జన్యాలు చేయడం మానేస్తే మంచిదని ఆయన తెలిపారు.