Home Page SliderNationalNews Alert

మా నాన్న సీఎం కావాలి..

Share with

ఒక కుమారుడిగా తన తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నానని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టుగా తన తండ్రి పూర్తి మెజార్టీ సాధిస్తారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి సీఎం కావాలని ఆకాంక్షించారు. ఇంతకాలం బీజేపీ పాలనలో కొనసాగిన అవినీతి, విధానపరమైన లోపాలను ఆయన సరి చేశారన్నారు. తన తండ్రి నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందించిందన్నారు. వరుణ నియోజకవర్గం నుంచి తన తండ్రి భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎంగా పని చేసిన సిద్ధ రామయ్య మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్‌ పార్టీని ముందుండి నడిపించారు. కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించడానికి ఆయన ముఖ్యపాత్ర పోషించారు. కొన్ని సందర్భాల్లో సీఎం పదవిపై తన ఆసక్తిని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.