Andhra PradeshHome Page Slider

ఆ విషయాలన్నీ నాన్నే నేర్పించారు: మహేష్ బాబు

Share with

హీరో మహేష్ బాబు తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మనం స్టార్ అయితే ఒత్తిడిని అంగీకరించాల్సిందేనని హీరో మహేష్ బాబు అభిప్రాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మహేష్ దంపతులు హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి దివంగత నటుడు కృష్ణను గుర్తు చేసుకున్నారు.

 నేను నటించిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందనప్పుడు నిరుత్సాహపడతాను. ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో అంచనాలుంటాయి. దాని వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది. దాని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే తర్వాతి సినిమాపై ఎక్కువ దృష్టి పెడతాను. మనం స్టార్ హీరో అయినప్పుడు ఒత్తిడిని అంగీకరించాలి. ఈ విషయం నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన చెప్పేవారు. క్రమశిక్షణ, వినయం.. వంటి వాటి ప్రాముఖ్యతను ఆయనే నేర్పించారు. విజయం ఒక్కసారిగా రాదని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటే గానీ వరిస్తుందని చెప్పారు అంటూ మహేష్ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారంలో నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రానున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ స్వరాలు అందిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దీని తర్వాత రాజమౌళితో మహేష్ ఓ సినిమా చేయనున్నారు.