BusinessInternational

నష్టాల్లో గిన్నిస్ రికార్డు సాధించిన మస్క్

Share with

ప్రపంచ కుబేరుడిగా నిన్న మొన్నటి వరకూ పేరు పొందిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈమధ్యనే ఆస్థానాన్ని కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే. ఈయన కోల్పోయన సంపద సంవత్సర కాలంలోనే దాదాపు 200 బిలియన్ డాలర్లు. ఇంత తక్కువ సమయంలో అత్యధిక సంపదను కోల్పోయిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డును సృష్టించినట్లు గిన్నిస్ రికార్డు

ప్రకటించింది. ప్రపంచంలోని ఏసంపన్నుడు ఇంత తక్కువ వ్యవధిలో ఈరకమైన నష్టాలు పొందలేదని గిన్నిస్ రికార్డ్స్ పేర్కొంది.

ఫోర్భ్స్ నివేదిక ప్రకారం మస్క్ సంపద 2021లో 320బిలియన్ డాలర్లు ఉండగా తాజా నివేదిక ప్రకారం 138 బిలియన్ డాలర్లకు పడిపోయింది. క్రిందటేడు 58 బిలియన్ డాలర్ల నష్టంతో రికార్డు పొందిన ఆయన రికార్డు తిరిగి అతనే 182 బిలియన్ డాలర్ల నష్టంతో తిరగరాశాడు. మస్క్ ఆస్తులు చాలావరకూ టెస్లా కంపెనీ షేర్ల రూపంలోనే ఉన్నాయి. ఈ షేర్లు భారీగా 65 శాతానికి మించి పతనావస్థకు చేరడంతో, మస్క్ సంపద ఆవిరయిపోయింది. దీనితో ప్రపంచ కుబేరులలో రెండవ స్థానానికి చేరుకున్నాడు మస్క్. ఫ్రాన్స్‌ కు చెందిన బెర్నాల్డ్ అర్నౌల్ట్ 198 బిలియన్ డాలర్ల సంపదతో ప్రధమస్థానంలో ఉన్నారు. ఈయన LVMH అనే కంపెనీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఇంత నష్టాలు చవి చూసినా, ఎలాన్ మస్క్ రెండవ స్థానంలోనే కొనసాగుతుండడం విశేషం.