News AlertTelangana

మునుగోడును దత్తత తీసుకుంటా : కేటీఆర్

Share with

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులైన బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. నేడు మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ను ఇవాళ దాఖలు చేశారు. టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

ఇక కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన తరువాత మొదటి ఉపఎన్నిక కావడంతో టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కంటే ముందు బంగారిగడ్డ నుండి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు . టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానన్నారు. తాను సిరిసిల్లను, మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటను ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా ఇద్దరం కలిసి మునుగోడును అభివృద్ధి చేస్తామన్నారు.