Home Page SliderNational

ఇండియాలో కాస్ట్‌లీ సిటీ ముంబై

Share with

దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ఈ ఏడాది ముంబై నిలిచింది. ఇక ఆసియాలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21 స్థానాన్ని ఆక్రమించింది. ఢిల్లీ 30 స్థానాన్ని ఆక్రమించింది. 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేను ఒక కన్సెల్టెన్సీ సంస్థ మెర్సర్ నిర్వహించింది. ఇతర దేశాల నుండి ఉద్యోగాల కోసం వలస వచ్చిన వారిని ఉద్దేశించి ప్రపంచంలోని ఏ దేశం అత్యంత ఖరీదైందో మెర్సర్ సర్వేచేసి తాజా ర్యాంకింగ్ ఇచ్చింది. ఇక ఇండియా విషయానికి వస్తే 2013 నుండి ముంబై అత్యంత ఖరీదైన నగరంగా నిలుస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ముంబై 11 స్థానాలు ముందుకు జరిగి 136 ర్యాంకున నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 226 నగరాల్లో మెర్సర్ సర్వే చేసింది. ఇక ఇండియాలో టాప్ 20 నగరాల విషయానికి వస్తే న్యూఢిల్లీ మాత్రం 164 గ్లోబల్ ర్యాంకులో నిలిచింది. చెన్నై 189వ ర్యాంకు, బెంగళూరు 195, హైదరాబాద్ 202, పుణె 205, కోల్‌కతా 207వ స్థానాన్ని చేరుకుంది. ఇక ఆసియా విషయానికి వస్తే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానం ఆక్రమించగా.. ఢిల్లీ 30 వ స్థానంలో నిలిచింది.