Home Page SliderTelangana

ములుగు: బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్‌కు మద్దతుగా ప్రచారంలో ఈటల

Share with

ములుగు బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్‌కు మద్దతుగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ మేనిఫెస్టో ప్రకటించిందన్నారు ఈటల. బీసీ గర్జన పెట్టి ప్రధాని మోడీ ఏం హామీలివ్వాలని కోరారన్నారు ఈటల. తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడాలని కోరానన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందన్నారు. కేసీఆర్‌ను ఓడించాలని చూస్తున్నారు. ఆ స్థానంలో బీజేపీని గెలిపించుకోవాలన్నారు. 20 ఏళ్లుగా శానసభసభ్యుడిగా, ఫ్లోర్ లీడర్‌గా ఆర్థిక మంత్రి, ఆరోగ్యమంత్రిగా పనిచేశారు కదా.. తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో చెప్పాలని మోడీ అడిగారన్నారు ఈటల. తెలంగాణ రైతాంగం బాధపడుతోందన్నారు. రైతు బంధు పేరిట రెండు పంటలకు ఇచ్చే రూ.10 వేలు మాత్రమే. బీజేపీ ఎరువుల సబ్సిడీ పేరిట పంటకు రూ.9 వేలు మేలు చేస్తోందన్నారు. పంట పండించే రైతుకు లాభం జరగాలన్నా… వరి మద్దతు ధరకు మంచి మద్దతు ధర ప్రకటించాలని సూచించానన్నారు. క్వింటాకు ఏడెనిమిది కిలోల తరుగు తీస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క గింజ కూడా తరుగు లేకుండా క్వింటాకు రూ.3,100 కు కొంటామని మోదీ హామీ ఇచ్చారు. ఆడబిడ్డలు గ్యాస్ ధర పెరిగిందంటున్నారు. నాలుగు సిలిండర్ల చొప్పున పేదవాళ్లకు ఫ్రీ సిలిండర్లు ఇవ్వాలని ప్రధాని మోడీ నాతో చెప్పారన్నారు ఈటల. మూడో తారీకు తర్వాత గ్యాస్‌పై భారం లేకుండా బీజేపీ అందిస్తుందన్నారు. పేదవాళ్లకు కూడా క్యాన్సర్, హార్ట్ ఎటాక్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెబితే అందుకు రూపాయి ఖర్చు లేకుండా పేద ప్రజలకు వాగ్దానం ఇవ్వాలని అన్నారు. వైద్యాన్ని ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. రూ.10 లక్షల లోపు ప్రభుత్వపరంగా అందిస్తామని చెప్పమన్నారని ఈటల చెప్పారు. నాలుగో హామీగా విద్య గురించి హామీ ఇవ్వాలన్నారు. పేద వాళ్లు కూడా ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. రూ.50-60 వేలు ఖర్చు పెట్టి చదివించాల్సి వస్తోందన్నారు. కూలి పని చేసేవాళ్లకు, వ్యవసాయం చేసేవాళ్లకు ఏడాదికి లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పా. నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ఉచితంగా అందించాలన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తాం. తెలంగాణ ఆడబిడ్డలకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.4,250 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే బకాయిలు ఇస్తామన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి డబ్బును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మహిళలు చెల్లించే ఇన్సూరెన్స్ డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు ఈటల. కేసీఆర్ ఎప్పుడైనా ములుగుకు వచ్చారా అని ప్రశ్నించారు ఈటల. కేసీఆర్ ఉంటే ఫామ్ హౌజ్‌లో లేకుంటే ప్రగతి భవన్‌లో. ఐఏఎస్‌లను కలవడు, ఎమ్మెల్యేలను కలవడు, మంత్రులను కలవడు. ప్రజలను గౌరవించని వాడు కేసీఆర్. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లోకి వస్తాడన్నారు. మాట ఇచ్చి తప్పే వ్యక్తి కేసీఆర్, మాట ఇస్తే అమలు చేసే వ్యక్తి మోడీ అని గుర్తుంచుకోండి. దేశంలో 4 కోట్ల మందికి మోడీ ఇళ్లిస్తే, కేసీఆర్ మాత్రం ఇళ్లివ్వకుండా మోసం చేస్తున్నాడన్నారు. ఇళ్ల పేరుతో కేసీఆర్ మళ్లీ మోసం చేస్తున్నారన్నారు. మోడీ మద్దతుతో బీజేపీ తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతుందన్నారు. పదేళ్లయినా తెలంగాణలో నౌకరీలు రాలా… నిరుద్యోగ భృతి రూ.3 వేలిస్తానన్నాడు. అది కూడా ఇవ్వలేదు. 17 పరీక్షా పేపర్లు లీకులు చేసి.. డబ్బులున్నోళ్లే నౌకరీలు కొనుక్కునేలా చేశాడని విమర్శించారు. దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా అని ప్రశ్నించారు ఈటల. రూ.900 కోట్లతో సమ్మక-సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్శిటీ మోదీ ఇచ్చారన్నారు.