NationalNews Alert

భారత అటార్నీ జనరల్‌గా మరోసారి ముకుల్ రోహత్గి

Share with

సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి భారత అటార్నీ జనరల్‌(ఏజీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రసుత ఏజీ కేకే వేణు గోపాల్ రిటైర్మెంట్ తర్వాత రోహత్గి ఈ బాధ్యతలను చేపట్టవచ్చు. రోహత్గి ఏజీ పదవిని స్వీకరించడం ఇది రెండవ సారి . గతంలో ఏజీగా పనిచేసిన రోహత్గి 2017 జూన్‌లో ఈ బాధ్యతల నుంచి వైదొలగడంతో ఆ తర్వాత కేకే వేణుగోపాల్ ఆ బాధ్యతల్ని తీసుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన వేణుగోపాల్ పదవీ కాలం ముగియనుంది. కేకే వేణుగోపాల్ ఈ పదవిలో దాదాపు 5ఏళ్లుగా కోనసాగుతున్నారు.

2020లోనే వేణుగోపాల్ మూడేళ్ల పదవి కాలం ముగిసింది. తన వయస్సును దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి ఇవ్వాలని అప్పట్లో వేణుగోపాల్ ప్రభుత్వన్ని కోరారు. కానీ కేంద్రం మరో మూడేళ్ల పాటు పదవిలో కోనసాగమని కోరడంతో ఆయన కొనసాగారు. ఇక అక్టోబర్1 నుంచి ముకుల్ రోహత్గీ అటార్నీ జనరల్ బాధ్యతలను స్వీకరిస్తారు. గతంలో ఆయన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా చేశారు.