Home Page SliderNational

మిస్టర్ కెప్టెన్ కూల్ ధోని ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

Share with

మహేంద్ర సింగ్ ధోని ఇండియాలో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరనే చెప్పాలి. టీమిండియా మాజీ కెప్టెన్,చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోని ఎన్నో విజయాలను సాధించాడు. మరి తన ఆటతో,వ్యక్తిత్వంతో ఎన్నో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ధోని ఆస్తులు,సంపాదనపై స్టాక్‌గ్రో అనే కంపెనీ ఓ పోస్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం ధోని మొత్తం ఆస్తుల విలువ రూ.1,040 కోట్లు అని వెల్లడించింది. కాగా IPLలో ధోని చెన్నై సూపర్ కింగ్స కెప్టెన్‌గా రూ.12 కోట్లు అందుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా బ్రాండ్ల ఎండార్స్‌మెంట్ ద్వారా రూ.4-6 కోట్లు,సోషల్ మీడియా ఫీజు ద్వారా రూ.1-2 కోట్లు ఆర్జిస్తారని పేర్కొంది. అలాగే వివిధ కంపెనీల్లో ధోని పెట్టుబడులు పెట్టారని తెలిపింది. ఇవే కాకుండా ధోని దగ్గర ఎన్నో విలువైన కార్లు,బైక్స్ ఉన్నాయని స్టాక్‌గ్రో సంస్థ స్పష్టం చేసింది.