Home Page SliderTelangana

ఎన్నికలలో డబ్బు..రంగంలో దిగిన ఆర్‌బీఐ

Share with

అసెంబ్లీ ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టడానికి ఎన్నికల సంఘం పంచముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఆర్‌బీఐని కూడా రంగంలోకి దించింది. ఎన్నికల ప్రకటన వెలువడిన మూడ్రోజులలోనే పలు ప్రాంతాలలో స్వాధీనం చేసుకున్న డబ్బు, బంగారం, మద్యం విలువ అంతా కలిపి 10 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు. దీనితో ఉలిక్కిపడ్డ ఎన్నికల సంఘం రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలనూ ఆర్థికంగా సమస్యాత్మకంగా ప్రకటించింది. పోటాపోటీగా రాజకీయపార్టీలు ఇక్కడ పోటీలు పడడంతో డబ్బు ప్రభావం పెరిగిపోవచ్చని అంచనాలు వేస్తున్నారు. పశ్చిమబెంగాల్, కర్ణాటక ఎన్నికలలో డబ్బు కట్టడికి అనుసరించిన మార్గాలు సత్పలితాలు ఇవ్వడంతో మరోసారి ఆప్రయోగాన్ని చేపట్టబోతోంది ఎన్నికల కమీషన్.  ఆన్‌లైన్ లావాదేవీలపై నిఘా పెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించనుంది. దీనిలో ప్రతీ బ్యాంకులో రోజువారాగా విత్‌డ్రా అయ్యే మొత్తం ఎంత, ఏఏ ఖాతాల నుండి విత్‌డ్రా అవుతున్నాయి. కరెన్సీ చెస్ట్ నుండి బ్రాంచీలకు ఎంత వెళుతోంది. గత ఏడాది ఇదే సమయంలో ఎంత వెళ్లిందో గుర్తించడం, నిఘా పెట్టడం. గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం తదితి డిజిటల్ సంస్థల చెల్లింపులపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా నిఘా పెడుతున్నారు. పోస్టాఫీసుల్లో ఖాతాల నగదు బదిలీలు పరిశీలించడం, రోజువారీ నివేదికలు ఇవ్వడం వంటివి ఆర్బీఐ గుర్తించి సమాచారం ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. దీనితో ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్దతులలో నగదు పంపిణీకి అడ్డుకట్ట వేసినట్లవుతుంది.