Home Page SliderInternational

2023లో భారత దౌత్య సంబంధాలలో మోదీ మార్కు

Share with

గత ప్రధానులెవ్వరూ సాధించని ఘనతను ప్రధాని మోదీ సాధించారని My Gov India ద్వారా కేంద్రప్రభుత్వం అభివర్ణించింది. ఈ 2023 వ సంవత్సరంలో ప్రధానిమోదీ దౌత్యసంబంధాలలో తన మార్కును వేశారని పోస్టులు పెట్టింది. ఆయన నేతృత్వంలో భారత్ బలీయమైన శక్తిగా ప్రపంచదేశాలలో గుర్తింపు తెచ్చుకుందని పేర్కొంది. ప్రధాని అధికారిక పర్యటనలు, గౌరవాలు, ఒప్పందాలను గుర్తుచేస్తూ ట్వీట్లు చేసింది.

26 ఏళ్ల తర్వాత ఈజిప్టును, 40 ఏళ్ల తర్వాత గ్రీస్, మొట్టమొదటిసారిగా పపువా న్యూగినియాకు వెళ్లిన భారత ప్రధానిగా మోదీ రికార్డును సృష్టించారు. విదేశీ పర్యటన సందర్భాలలో ఆయనకు ప్రవాస భారతీయులు, ప్రభుత్వాల నుండి ఘన స్వాగతాలు దక్కాయి. ఆరు దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలు ఇచ్చి గౌరవించాయి. అమెరికా పర్యటనలో చారిత్రక ఒప్పందాలు జరిగాయి.  మోదీకి 15 ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పైగా మోదీ పర్యటనలతో ఇండియా-మిడిల్ ఈస్ట్- యూరప్‌ల మధ్య ఎకనామిక్ కారిడార్‌ను సాధించారు. మొత్తానికి ఈ సంవత్సరం భారత్‌ను ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబెట్టడంలో మోదీ తన మార్కును వేశారు.