Home Page SliderTelangana

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు 720 కోట్లతో ఆధునికీకరణ పనులకు మోదీ శ్రీకారం

Share with

ఏనాడో నిజాం కాలంలో నిర్మించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు మహర్థశ పట్టబోతోంది. ఇది దేశంలోనే రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటని చెప్పవచ్చు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను ఈ స్టేషన్ తీర్చలేకపోతోంది.  ఎయిర్ పోర్టు తరహాలో దీనిని ఏకంగా 720 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నారు. కొత్తభవనంలో 26 లిఫ్టులు, భవనాలు రాబోతున్నాయి. కొత్త హంగులు రాబోతున్నాయి. డబుల్ లెవెల్ రూఫ్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు రాబోతున్నాయి. రేపటి నుండి సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లబోయే వందేభారత్ రైలుకు కూడా మోదీ పచ్చజెండా ఊపబోతున్నారు. ఎంఎంటీసీ రెండవ దశ పనులకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు.