Home Page SliderNational

మేఘాలయ ప్రచారంలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ

Share with

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ ర్యాలీలో ‘మోదీ తేరీ కబర్‌ ఖుదేగీ’ (మోదీ, మీ సమాధి తవ్వుతారు) అనే నినాదాన్ని లేవనెత్తిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం, ప్రజలు ‘మోదీ తేరా కమల్ ఖిలేగా’ (మోదీ మీ కమలం వికసిస్తుంది) అంటున్నారన్నారు. ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, అభ్యంతరకరమైన పదజాలం లేదా ఆలోచనలు ఉపయోగించిన వారికి దేశం తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. “దేశం తిరస్కరించిన వారు, దేశం అంగీకరించడానికి సిద్ధంగా లేనివారు.. ‘మోదీ తేరీ కబర్ ఖుదేగీ’ అని నినాదాలు చేస్తున్నారు. కానీ దేశం ‘మోదీ తేరా కమల్ ఖిలేగా’ అంటోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాను ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఛత్తీస్‌గఢ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకోవడంతో ఆ పార్టీ సభ్యులు వివాదాస్పద నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతం ప్రచారం జరిగింది. ఖేరాను అసోం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానమంత్రి తండ్రిని అవమానించడంతోపాటుగా, మతపరమైన శత్రుత్వాన్ని సృష్టించారనే ఆరోపణలపై ఖేరాను పోలీసులు అరెస్టు చేయగా, ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.


“కుటుంబమే మొదట” అనే విధానం కాంగ్రెస్ పార్టీదని… కానీ… మేఘాలయ ప్రభుత్వం “ప్రజలే మొదట” అనే నినాదం ప్రకారం పనిచేస్తోందన్నారు. “ఇవాళ మేఘాలయ ప్రజలు… కుటుంబం ఫస్ట్ కాకుండా, పీపుల్ ఫస్ట్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. అందువల్లే ‘తామరపువ్వు’ మేఘాలయ బలం, శాంతి, స్థిరత్వానికి పర్యాయపదంగా మారింది” అన్నారు.

షిల్లాంగ్‌లో ప్రధాని మోడీ పర్యటన ఎన్నికల ర్యాలీకి ముందు రోడ్‌షో నిర్వహించారు. బీజేపీకి మద్దతిస్తున్నందుకు ప్రధాని మోడీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రోడ్‌షోలో కురిపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్న మోదీ… ప్రజల నుండి ఈ ప్రేమ, ఆశీర్వాదం మేఘాలయలో అభివృద్ధి తీసుకురావడం ద్వారా తిరిగి చెల్లిస్తామన్నారు. మేఘాలయతోపాటుగా, నాగాలాండ్‌లోనూ ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.